బ్రిటిష్ గుండెల్లో వణుకు.. ‘ఫౌజీ’లో ప్రభాస్ పాత్ర ఏంటో తెలిసిపోయింది.. టీజర్ చూశారా?
Advertisement
- ప్రభాస్ ‘ఫౌజీ’ టీజర్ విడుదల
- 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
- నేతాజీ, హిట్లర్ సంభాషణతో ఆసక్తికరంగా టీజర్
- బ్రిటిష్ సైన్యానికి చిక్కని గూఢచారిగా ప్రభాస్ పాత్ర
- భగవద్గీత ఆధారంగా రహస్య కోడ్ భాష రూపొందించిన ఫౌజీ
Advertisement
రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి చారిత్రక నేపథ్యంలో సాగే భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్ర టీజర్‌ను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాను 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరు 3న విడుదల చేయాలని భావించారు.
టీజర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణ ఆసక్తి రేపుతోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెర్లిన్‌లో వీరిద్దరూ కలిసినట్లు చూపించారు. బ్రిటిష్ పాలన నుంచి భారత్‌కు విముక్తి కల్పించేందుకు జర్మనీ సాయం చేయాలని బోస్ కోరతారు. అయితే, బ్రిటన్ రెండు శతాబ్దాలుగా భారత్‌ను పాలిస్తోందని, ఓడిపోయే పోరాటానికి తాను మద్దతివ్వనని హిట్లర్ బదులిస్తాడు.
బ్రిటిష్ సైన్యానికే అంతుచిక్కని గూఢచారి
భారతీయుల సత్తా ఏంటో హిట్లర్‌కు బోస్ వివరిస్తారు. బ్రిటిష్ పాలకులకు జర్మనీ గూఢచారుల గురించి తెలుసని, కానీ భారతీయ గూఢచారి ఫౌజీ గురించి ఏమీ తెలియదని చెబుతారు. సింగపూర్‌ను బ్రిటన్ నుంచి జపాన్ స్వాధీనం చేసుకోవడంలో ఫౌజీ కీలక పాత్ర పోషించినట్లు టీజర్లో చూపించారు. సైనికుడిగా, వ్యూహకర్తగా, గూఢచారిగా అతడి ప్రతిభను బోస్ వివరిస్తారు.
భగవద్గీత ఆధారంగా ఫౌజీ ఓ రహస్య కోడ్ భాషను రూపొందించినట్లు టీజర్లో వెల్లడించారు. జర్మనీకి చెందిన ‘ఎనిగ్మా’ కోడ్ సిస్టమ్ కంటే దీన్ని ఛేదించడం కష్టమని బ్రిటిష్ పాలకులే అంగీకరించినట్లు చూపించారు. అతడి అసలు పేరెవరికీ తెలియదని, బ్రిటిష్ వాళ్లు మాత్రం ‘ఫౌజీ’ అని పిలుస్తారని బోస్ చెప్పడంతో టీజర్ ముగుస్తుంది.
భారీ తారాగణంతో చారిత్రక కథ
1940ల కాలం నేపథ్యంలో సాగే కల్పిత చారిత్రక కథగా ‘ఫౌజీ’ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, సుదీప్ ఛటర్జీ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ‘సీతారామం’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హను రాఘవపూడి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు.
ఈ సినిమా పౌరాణిక చిత్రం కాదని, భగవద్గీత నుంచి తాత్విక స్ఫూర్తిని మాత్రమే తీసుకున్నామని గతంలో దర్శకుడు స్పష్టం చేశాడు. బ్రిటిష్ పాలన కాలంలోని దేశభక్తి, మానవీయ భావోద్వేగాలు, సామాజిక రాజకీయ సంఘర్షణలు ఇందులో ప్రధానంగా ఉంటాయని తెలిపాడు.